AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మీకు ఈలలు వేయడం వచ్చా?.. అయితే ఆ గ్రామానికి వెళ్లాల్సిందే ..

ఈలే గ్రామస్థుల భాష.. విజిల్ విలేజ్ గా ఫేమస్
మనం ఎవరితోనైనా పరిచయం ఏర్పరుచుకోవాల్సినప్పుడు సాధారణ భాష లేదా ఎదుటి వ్యక్తికి అర్థం అయ్యే భాష మాట్లాడతాం అన్న సంగతి తెలిసిందే.. అయితే భారతదేశంలో రోజు అన్ని కార్యకలాపాలకు ‘విజిల్’ వేస్తూ సంభాషించుకునే ఒక గ్రామం ఉంది. అందుకే ఈ గ్రామాన్ని విజిల్ విలేజ్ అని ప్రపంచానికి పరిచయం అయింది. ఈ విజిల్ గ్రామం మేఘాలయ కొండల్లో దాగి ఉన్న కొంగ్‌థాంగ్ గ్రామం..ఈ వింతైన గ్రామం గురించి తెలుసుకుందాం..

విజిల్‌తో ఎందుకు పిలుస్తారంటే..
కాంగ్‌థాంగ్ మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్‌లో ఉంది. తల్లులు తమ నవజాత శిశువుల కోసం ఒక ట్యూన్‌ను రూపొందించే ‘జింగ్‌వాయి లాబీ’ ( అంటే మదర్స్ లవ్ సాంగ్ ) ప్రత్యేకమైన సంప్రదాయం కారణంగా ‘విజిల్ గ్రామం’గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ప్రజలు సెంగ్ ఖాసీ తెగకు చెందినవారు. ఖాసీ భాష మాట్లాడతారు. ఇక్కడ ప్రజలు ప్రత్యేకమైన రాగాలతో ఒకరినొకరు పిలుచుకుంటారు. తల్లి చేసిన ట్యూన్ తో పిల్లవాడికి గుర్తింపు లభిస్తుంది. రోడ్డుపక్కన నడుస్తుంటే ఎన్నెన్నో అరుపులు, ఈలలు వినిపిస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం ఈ గ్రామ జనాభా కేవలం 600 మాత్రమే. ఇక్కడ 600 కంటే ఎక్కువ రాగాలు వినిపిస్తాయి.

ఈ గ్రామ ప్రజలు తమ సందేశాన్ని ఇతరులకు తెలియజేయడానికి ఈలలు వేస్తారు. ఎదుటి వ్యక్తి మాత్రమే ఆ విషయాన్ని అర్థం చేసుకోగలడు. అయితే ఇలా చెప్పే సమాచారం ఎదుటివారికి అర్ధం కాకుండా చెబుతారు. గ్రామస్తులు ఈ రాగాన్ని జింగర్వాయి లవ్బీ అని పిలుస్తారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ గ్రామ ప్రజలు మహా సిగ్గరి. బయటి వ్యక్తులతో చాలా త్వరగా కలవరు. అయితే ఈ సంప్రదాయం ఎక్కడ నుండి మొదలైందో ఎవరికీ తెలియదట.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10