రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల పాటు ఏకంగా 15 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన అతిపెద్ద రైలు ప్రమాదంలో ట్రాక్ మొత్తం దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం బహనాగ బజార్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వందలాది మంది కార్మికులు తీవ్రస్థాయిలో కష్టపడటంతో.. సుమారు 50 గంటల తర్వాత మళ్లీ పలు రైళ్ల ప్రయాణాలు మొదలయ్యాయి. అయితే.. ట్రాక్ పనులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని హౌరా మార్గంలో రాకపోకలు సాగించే 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆదివారం నుంచి బుధవారం వరకు మొత్తంగా 15 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన రైళ్ల వివరాలివే..
11న మైసూరు- హౌరా (22818)
12న తేదీన
హైదరాబాద్-షాలిమార్ (18046)
ఎర్నాకుళం-హౌరా (22878)
సంత్రగాచి-తంబ్రం(22841)
హౌరా-చెన్నై సెంట్రల్ (12839)
13వ తేదీన..
సంత్రగాచి-చెన్నై సెంట్రల్(22807)
హౌరా- ఎఎంవీటీ బెంగళూరు(22887)
షాలిమార్-చెన్నై సెంట్రల్ (22825)
షాలిమార్-హైదరాబాద్(18045)
సికింద్రాబాద్-షాలిమార్(12774)
హైదరాబాద్-షాలిమార్ (18046)
విల్లుపురం-ఖరగ్‌పూర్(22604)
14వ తేదీన..
ఎస్‌ఎంవీటీ బెంగళూరు-హౌరా (22864)
భాగల్పూర్ -ఎస్‌ఎంవీటీ బెంగళూరు(12254)
షాలిమార్-సికింద్రాబాద్ (12773)