ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో సోమవారం ఉదయం నక్సల్స్‌కు భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈనెల 7న బిజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, నక్సల్స్ మధ్య ఎన్కౌంటర్ జరిగిన అనంతరం మరోసారి నక్సల్స్, పోలీసులు తలపడ్డారు.
7న జరిగిన ఘటనలో కోబ్రా, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా నక్సల్స్‌ను భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు, కాల్పుల శబ్ధాలు వినిపించాయి. ఇక జూన్ 5న సుక్మా జిల్లాలో కరుడుగట్టిన నక్సల్‌ను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. సుర్పంగుడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం నుంచి సునీల్ అలియాస్ సోది దేవను భద్రతా దళాలు అరెస్ట్ చేశాయని సుక్మ ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు.