AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జెడ్పీ చైర్మన్ జగదీశ్ హఠాన్మరణం బాధాకరం : మంత్రి ఎర్రబెల్లి

ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ములుగు జిల్లా పరిషత్ చైర్మన్, కుసుమ జగదీష్ హఠాన్మరణం బాధాకరమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నిన్న మొన్నటి వరకు కలివిడిగా తిరిగిన జగదీష్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది అన్నారు. వారి మృతి తనకు తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా నాటి ఉద్యమంలో జగదీష్ చురుకైన పాత్ర పోషించారన్నారు.

ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా, జిల్లా పరిషత్ చైర్మన్ గా జగదీష్ నన్ను కలిసినప్పుడల్లా ములుగు ప్రాంత అభివృద్ధికి కావాల్సిన నిధుల గురించే అడిగేవారని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి బీఆర్ ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

ANN TOP 10