తెలంగాణ (Telangana) బీజేపీ నేతలు హైదరాబాద్‌లో రహస్యంగా సమావేశం అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన నేతలు పాల్గొన్నారు. ఇంకా ఈ సమావేశంలో విఠల్, విజయశాంతి, వివేక్ , జితేందర్రెడ్డి, రవీంద్రనాయక్, బూర నర్సయ్యగౌడ్ , దేవయ్య, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etala Rajendar)కు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి అన్న ప్రచారంపై నేతలు పెదవి విరుస్తున్నారు. పార్టీలో సీనియర్లగా ఉన్న తమకు అవకాశం ఎందుకివ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమంలో తాము కూడా కీలకంగా పనిచేశామని నేతలు అంటున్నారు. పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్లో ఉండగా.. ఢిల్లీ వెళ్లి లీకులు ఇవ్వాల్సిన అవసరం ఏముందంటున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న తమకు.. పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలియడంలేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.









