AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉద్యోగం వచ్చిందని రాత్రి స్వీట్లు పంచాడు.. తెల్లారేసరికి..

హార్ట్ ఎటాక్‌తో బీటెక్ విద్యార్థి మృతి
కామారెడ్డి జిల్లాలో ఓ బీటెక్ స్టూడెంట్ గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. నిద్రలోనే హార్ట్ ఎటాక్ రావటంతో చనిపోయాడు. వివరాల్లోకి వెళితే.. లింగంపేట మండలంలోని సురాయిపల్లి జగదాంబ తండాకు చెందిన ప్రశాంత్ బీటెక్ చివరి ఏడాది చదుతువున్నాడు. ఇటీవల క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో అతడికి ఉద్యోగం వచ్చింది. బెంగళూరులో ఉద్యోగం రావటంతో శుక్రవారం (జూన్ 9న) రాత్రి అందరికీ స్వీట్లు పంచాడు.

ఆ తర్వాత ప్రశాంత్ కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. ఉదయం ఎంత సేపటికి కుమారుడు లేవకపోతవటంతో తల్లి వెళ్లి కుమారుడని నిద్రలేపేందుకు ప్రయత్నించింది. అయితే అతను అచేతనంగా పడి ఉండటంతో ఆందోళకు గురైన వారు.. అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు మృతి చెందినట్లు చెప్పారు. నిద్రలోనే గుండెపోటు రావటంతో అతను ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

ఉద్యోగం వచ్చిందంటూ ఎంతో సంతోషంతో అందరికీ స్వీట్లు పంచిన కుమారుడు.. కొన్ని గంటల్లోనే ప్రాణాలు కోల్పోవటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపించారు. వారి రోధనలతో ఆసుపత్రి ప్రాగంణంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు రోధించిన తీరు అక్కడున్న వారిచే కంటతడి పెట్టింటింది.

ANN TOP 10