AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ పోలీస్ అధికారులకు గుడ్ న్యూస్..

పదోన్నతులు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణలో పోలీస్ అధికారులు బీఆర్ఎస్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అదనపు ఎస్పీలు, డీఎస్పీలుగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులకు పదోన్నతులు కల్పించింది. అదనపు ఎస్పీలుగా విధులు చేపడుతున్న వారిలో 18 మందికి ఎస్పీలుగా ప్రమోషన్ ఇచ్చింది. అలాగే మరో 35 మంది డీఎస్పీలకు అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించింది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు.

పదోన్నతులు పొందిన అధికారులు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. 15 రోజుల్లోగా నూతన విధుల్లో చేరాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. పదోన్నతి పొందిన వారిలో కరీంనగర్‌ అదనపు ఎస్పీ జి. చంద్రమోహన్‌, హైదరాబాద్‌ నగర అదనపు డీసీపీ ప్రసాద్‌ కర్రోల్ల, అదనపు ఎస్పీ (వెయిటింగ్‌) కిషన్‌ సింగ్‌ ధీరావత్‌ తదితరులు ఉన్నారు.

ANN TOP 10