రుతుపవనాల రాకకు ముందు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. మృగశిర కార్తే ప్రవేశించినప్పటికీ ఎండలు ఏమాత్రం తగ్గ టం లేదు. శుక్రవారం నాడు రాష్ట్రంలో అత్యధికంగా కరీనంగర్ జిల్లా తంగులలో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదేవిధమైన అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.









