AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. దివ్యాంగులకు దశాబ్ది కానుక

పెన్షన్ రూ.4116కు పెంపు
రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల ఆసరా పింఛన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. వచ్చే నెల నుంచి వికలాంగులకు రూ. 4,116 పింఛను చెల్లిస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం జరగాలని కోరుకున్నామో వాటిని ఒక్కొక్కటిగా సాధించుకుంటున్నామని తెలిపారు. మంచిర్యాలలో పలు అభివృద్ధి పనులకు సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేశారు. మంచిర్యాల వేదికగానే బిసి కులవృత్తులకు రూ.లక్ష సాయం, రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నస్పూర్‌లో 26.24 ఎకరాల విస్తీర్ణంలో రూ.41 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయాన్ని, జిల్లా బిఆర్‌ఎస్ కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు.

గోదావరి నదిపై రూ. 164 కోట్లతో నిర్మించనున్న మంచిర్యాల అంతర్గాం రహదారి వంతెన, హాజీపూర్ మండలం గుడిపేటలో వైద్య కళాశాల, మందమర్రిలో రూ.500 కోట్ల వ్యయంతో ఫామ్ ఆయిల్ పరిశ్రమ, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రూ.1,658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకం పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. మంచిర్యాలలో నిర్వహించిన బిఆర్‌ఎస్ బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడారు. మొత్తం తెలంగాణ సమాజం బాగుండాలి అని కెసిఆర్ పేర్కొన్నారు. ముసలమ్మలు, ముసలి తాతలు ఆసరా పెన్షన్లతో బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పారు. వికలాంగులకు రూ. 3,116 పెన్షన్ ఇస్తున్నామని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న ఈ సందర్భంలో వికలాంగుల పెన్షన్‌ను మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నామని వెల్లడించారు. అందరి సంక్షేమాన్ని, మంచిని చూసుకుంటున్నామని సిఎం తెలిపారు. మంచిర్యాల జిల్లా కోసం గతంలో జిల్లా వాసులు ఎన్నో ధర్నాలు చేశారని, అలాంటిది ఇప్పుడు జిల్లా కేంద్రాల్లో పని కోసం దూరం వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు.

ANN TOP 10