AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

స్కూళ్లకు వేసవి సెలవుల పొడిగింపుపై ..

క్లారిటీ ఇచ్చిన తెలంగాణ విద్యాశాఖ
తెలంగాణలో ఎండలు మండిపోతున్న వేళ.. పాఠశాలలకు వేసవి సెలవులను పెంచనున్నారంటూ చక్కర్లు కొడుతున్న వార్తలపై సర్కారు క్లారిటీ ఇచ్చింది. ముందుగా ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 12న పాఠశాలలు తెరవాల్సి ఉంది. రాష్ట్రంలో గత కొంత కాలంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో.. పాఠశాలలు తెరిస్తే.. పిల్లలు చాలా ఇబ్బందులు పడనున్నారని.. అందుకే సర్కారు వేసవి సెలవులను పొడగించే యోచన చేస్తుందంటూ.. సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ వార్తలకు చెక్ పెడుతూ.. తెలంగాణ విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. వేసవి సెలవులు పొడిగించే ఆలోచన లేదని.. యథావిధిగా పాఠశాలలు జూన్ 12న ప్రారంభించనున్నట్టు స్పష్టం చేసింది.

మరోవైపు.. ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు హెల్తీ డ్రింక్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే.. పాఠశాలలు పునప్రారంభం అయ్యే సమయానికి ఎండలు పూర్తిగా తగ్గే అవకాశం లేదు. అంతేకాకుండా.. పాఠశాలలకు వచ్చే క్రమంలో చాలా మంది పిల్లలు అల్పాహారం చేయకుండానే వస్తున్నట్టు రిపోర్టులు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. పాఠశాల ప్రారంభమైన తర్వాత 11 గంటల సమయంలో పిల్లలందరికీ రాగి జావా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో.. స్కూల్స్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే రాగి జావను పిల్లలకు అందజేయనున్నారు.

ANN TOP 10