అమ్మాయిని దారుణంగా హత్య చేసిన పూజారి..
శంషాబాద్ పరిధిలో ఓ మహిళను పూజారి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అప్సర అనే మహిళతో పూజారి అయిన అయ్యగారి సాయి కృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా అప్సర తనను పెళ్లి చేసుకోవాలంటూ అతనిపై ఒత్తడి తెచ్చింది. అయితే అప్పటికే సాయి కృష్ణకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. దీంతో ఎలాగైనా అప్సరను వదిలించుకోవాలని ప్లాన్ చేశాడు.
ఇక ఒక పూజారి అయి ఉండి మహిళను హత్య చేసి తీరు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అప్సరను సరోయూర్ నగర్ నుంచి కారులో ఎక్కించుకొని వచ్చి శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోది హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని కవర్‌లో కట్టి.. కారులో తీసుకెళ్లి సరూర్‌నగర్‌లోని మ్యాన్ హోల్‌లో పడేశాడు. ఆ తర్వాత ఏమి ఎరగనట్లు అప్సర కనిపించడం లేదని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ పోలీస్ స్టేషన్‌లో పూజారి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలను పోలీసులు బయటపెట్టారు. ఈ నెల 3వ తేదీన అప్సరను సాయి కృష్ణ హత్య చేసినట్టు గుర్తించారు.









