AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కోకాపేటలో భారత్ భవన్ కు శంకుస్థాపన చేసిన కేసీఆర్

కోకాపేటలో భారత్ భవన్ కు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. భారత్ భవన్ సెంటర్ పర్ ఎక్స్ లెన్స్ అండ్ హెచ్ఆర్డీగా భవనానికి నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు పాల్గొన్నారు.

కోకాపేటలో మొత్తం 11 ఎకరాల్లో మొత్తం 15 అంతస్తుల్లో భవనం నిర్మిస్తున్నారు. కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమాలు,శిక్షణా తరగతులు నిర్వహించేలా ప్లాన్ చేశారు. కోకాపేటలో అత్యంత విలువైన భూమిని తక్కువ ధరకు బీఆర్ఎస్ కు కేటాయిస్తు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేవలంలో ఐదు రోజుల్లో నే భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కోకాపేటలో గజం లక్ష రూపాయలకు పైగా పలుకుతుండగా కేవలం రూ. 7500 లకు గజం చొప్పున 11 ఎకరాలను ప్రభుత్వం కట్టబెట్టింది. వందల కోట్ల స్థలాన్ని కేవలం 40 కోట్లకే కట్టబెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

ANN TOP 10