AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహాభారత్ శకుని మామ గుఫీ పైంటల్ కన్నుమూత

ముంబై: టివి సీరియల్ మహాభారత్‌లో శకుని మామగా నటించి ఇంటింటికీ చేరువైన గుఫీ పైంటల్ సోమవారం ఉదయం ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు. 79 సంవత్సరాల పైంటల్ గత కొంతకాలంగా వృద్ధాప్యం కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో నిద్రలోనే ఆయన కన్నుమూసినట్లు వారు చెప్పారు.

1980వ దశకంలో పైంటల్ అనేక హిందీ చిత్రాలలో హాస్య నటుడిగా నటించారు. సుహాగ్, దిల్లగీ, ‘sohs ;o ‘shse, వంటి చిత్రాలలో నటించిన గుఫీ పైంటల్‌కు బిఆర్ చోప్రా నిర్మించిన టీవీ సీరియల్ మహాభారత్‌లోని శకుని పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. శకుని మామగా ప్రతి ఇంటా ఆయన పేరు మార్మోగింది.

పైంటల్‌కు కుమారుడు, కోడలు, ఒక మవనడు ఉన్నారు. ఆయన భౌతికకాయానికి అంధేరిలోని స్మశాన వాటికలో సోమవారం సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయి.

ANN TOP 10