AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైలు ప్రమాదంపై సోనియాగాంధీ తీవ్ర విచారం..

ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన ఘోర రౌలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. ఇది చాలా దురదృష్టకర ఘటన అని అన్నారు. అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తననెంతో కలిచివేసిందని, మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

కాగా, ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని తెలుసుకోవాలని, కాంగ్రెస్ కార్యకర్తలు, అనుబంధ సంస్థలు చేస్తున్న సహాయక కార్యక్రమాలను సమీక్షించాలని లోక్‌సభలో కాంగ్రెస్ నేత ఆధీర్ రంజన్ చౌదరిని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆదేశించారు.

ANN TOP 10