AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లు

గుడ్‌న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లేవారికి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక ట్రైన్లను నడపనున్నట్లు తెలిపారు. కాచిగూడ- తిరుపతి, కాచిగూడ- కాకినాడ టౌన్ మధ్య ఈ స్పెషల్ ట్రైన్లు నడవనున్నాయి. అధికారులు వెల్లడించిన ట్రైన్ల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి నుంచి తిరుపతికి (ట్రైన్ నంబర్ 07061) మే 25 నుంచి ప్రతి గురువారం స్పెషల్ వీక్లీ ట్రైన్ నడపనున్నారు. ఈ స్పెషల్ రైలు ప్రతి గురువారం రాత్రి 10.10 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు అంటే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ఇక కాచిగూడ నుంచి కాకినాడ టౌన్‌కి (ట్రైన్ నంబర్ 07417) స్పెషల్ వీక్లీ ట్రైన్‌ను ఈ నెల 27 నుంచి ప్రతి శనివారం నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ స్పెషల్ రైలు ప్రతి శనివారం రాత్రి 8.45 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.45 గంటలకు కాకినాడ టౌన్‌కి చేరుకుంటుంని చెప్పారు. తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్ నుంచి కాచిగూడకు (ట్రైన్ నంబర్ 07418) ఈ నెల 28 నుంచి ప్రతి ఆదివారం స్పెషల్ ట్రైన్ నడపనున్నారు. ఈ ట్రైన్ ప్రతి ఆదివారం రాత్రి 9.55 గంటలకు కాకినాడ టౌన్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10