తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడు వెలువడ్డాయి. ఉదయం 9.30 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఫలితాలను విడుదల చేశారు. ఇక ఇంజినీరింగ్‌లో 80 శాతం ఉత్తీర్ణత, అగ్రికల్చర్, ఫార్మాలో 86 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ ఎంసెట్‌లో సైతం బాలికలదే పై చేయి. ఇంజినీరింగ్‌లో 79 శాతం మంది అబ్బాయిలు, 85 శాతం మంది అమ్మయిలు క్వాలిఫై అయ్యారు. ఇంజినీరింగ్‌లో అనిరుధ్ అనే విద్యార్థికి మొదటి ర్యాంకు లభించింది. వెంకట మణిందర్ రెడ్డికి సెకండ్ ర్యాంకు లభించింది.
ఎంసెట్ టాపర్స్
అగ్రికల్చరల్ అండ్ ఫార్మా టాపర్స్
1.బూరుగుపల్లి సత్య ఫస్ట్ ర్యాంక్
2.నాసిక వెంకట తేజ
3.పసుపులేటి లక్ష్మి
4.దుర్గంపూడి కార్తికేయ రెడ్డి
5.బుర్ర వరుణ్ తేజ
ఇంజనీరింగ్ విభాగంలో టాపర్స్
1. సనపల్ల అనిరుద్ ఫస్ట్ ర్యాంక్
2. యాకంటి మనిందర్ రెడ్డి
3.చల్ల ఉమేష్ వరుణ్
4.అభినిత్ మంజెటి
5.పన్నతోట ప్రమోద్ కుమార్ రెడ్డి
కాగా ఈ నెల 10, 11 తేదీల్లో ఎం సెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. 12 నుంచి 15 వరకు ఆరు విడుతల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరిగాయి. ఇంజినీరింగ్ పరీక్షకు లక్షా 95 వేల 275 మంది విద్యార్థులు హాజరయ్యారు. అగ్రికల్చర్ పరీక్షను లక్షా 6 వేల మంది విద్యార్థులు రాశారు. ఇటీవల ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసి అభ్యంతరాలను అధికారులు స్వీకరించారు. కాగా.. ఎంసెట్ ఫలితాల కోసం www.ntnews.com, eamcet.tsche.ac.in అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.