AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.12 కోట్లు..

కేరళలో ఓ వ్యక్తికి రూ.12 కోట్ల లాటరీ తగిలింది. విషు బంపర్‌ లాటరీ పేరుతో తిరువనంతపురం జిల్లాలో ఈ టికెట్లను కేరళ లాటరీ డిపార్ట్‌మెంట్‌ అమ్మింది. బుధవారం మధ్యాహ్నం విషు బంపర్‌ లాటరీ డ్రా జరిగింది. మలప్పురం జిల్లా తిరూర్‌లోని ఎం 5087 ఏజెన్సీకి చెందిన ఆదర్శ్‌ అనే వ్యక్తి.. ఈ రూ.12 కోట్ల విన్నింగ్‌ టికెట్‌ను విక్రయించాడు. విజేత లాటరీ టికెట్‌ నంబరు వీఈ 475588. దీన్ని కొన్నది ఎవరన్నది ఇంకా తెలియలేదు. 10% ఏజెన్సీ కమీషన్‌, 30% ఇతర పన్నులు మినహాయించకుని మిగిలిన మొత్తం రూ.7.20 కోట్లు అతడు అందుకోనున్నాడు. ఇదే డ్రాలో.. మరో ఆరుగురికి రెండో బహుమతి లభించింది. వీరికి ఒకొక్కరికి కోటి రూపాయల చొప్పున అందజేస్తారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10