తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2023 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. హైదరాబాద్లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ)లో ఉదయం 9.30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్టీయూ-హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఫలితాలు https://eamcet.tsche.ac.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. ఫలితాలను ఉదయం 9.45 గంటల తర్వాత వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని వివిధ కేంద్రాలలో మే 10 నుండి 14 వరకు నిర్వహించిన TS EAMCET 2023కి మొత్తం 3,20,683 మంది అభ్యర్థులు హాజరయ్యారు. తెలంగాణ ఎంసెట్ ఫలితాలను మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు. అదే సమయంలో కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశమై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరుకావాల్సి రావడంతో ఫలితాల విడుదల సమయాన్ని ముందుకు తీసుకొచ్చారు.