AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీనన్నకు జనం నీరాజనం


ఊరూరా ఘనస్వాగతం
ఆదిలాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి ఆదిలాబాద్‌ రూరల్‌ మండలం లో పర్యటించారు. మండలంలోని దార్లోద్ది, గుండం లొద్ది, రాముగూడ గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామస్థులు తమ సాంప్రదాయ రీతిలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బి.ఆర్‌.ఎస్‌ ప్రభుత్వ మోస పూరిత వాగ్ధానాలు హామీలను కంది శ్రీనివాస రెడ్డి ప్రజలకు విరించారు. పొడుభూములకు పట్టాలు, రైతు రుణమాఫీ, రేషన్‌ కార్డులు, స్కాలర్షిప్‌ లాంటి వేవి అందడం లేదని ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ప్రజలకు వివరించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి గుండంలొద్ది చెరువును పరిశీలించారు. కార్యక్రమం లో జిల్లా ఎస్‌. టి సెల్‌ చైర్మన్‌ సెడ్మాకి ఆనంద్‌ రావు,జిల్లాఎస్‌. టి సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కుమ్రా భీమ్‌ రావు, జనరల్‌ సెక్రటరీ కుమ్రా జ్ఞానేశ్వర్‌,గ్రామ పటేల్‌ ఆత్రం గంగాధర్‌, ఐనేని సంతోష్‌ రావు, సిడాం రాము, మెస్రం చిత్రు,అల్లూరి అశోక్‌ రెడ్డి, పోతారాజు సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10