AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సుదీర్ఘ బుజ్జగింపుల తర్వాత.. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య

ఎల్లుండి ప్రమాణస్వీకారం..
కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య పేరు ఖరారైంది. సీనియార్టీ దృష్ట్యా సిద్దరామయ్య వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అధికారికంగా ప్రకటించనప్పటికీ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సుదీర్ఘ చర్చల తర్వాత కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు ఏకాభిప్రాయానికి వచ్చారు. శనివారం (మే 20) బెంగళూరులో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. సిద్దరామయ్య ప్రమాణస్వీకారానికి భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్నాటకలో సిద్దరామయ్య ఇంటి దగ్గర ముఖ్యమంత్రి స్థాయి భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో సిద్దరామయ్య వర్గం నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు.

ఈ నెల 20న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లుగా సమాచారం. అయితే, ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం డీకే శివకుమార్ ప్రభుత్వంలో చేరడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. నాలుగు రోజుల మేధోమథనం తర్వాత కర్ణాటక సీఎం పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది.

ANN TOP 10