AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హోరాహోరీ చర్చల్లో సిద్ధరామయ్య దే పైచేయి

కర్ణాటక సీఎం రేసులో సిద్ధరామయ్య తన ప్రత్యర్థి డీకే శివకుమార్‌పై విజయం సాధించారు. కర్ణాటకలో సీఎం రేసులో సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య హోరాహోరీ పోరు సాగినా సిద్ధరామయ్య విజయం సాధించారు. అయితే, అది అంత సులభం కాదు. వీరిద్దరి మధ్య సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్‌లో గందరగోళం ఎలా ఏర్పడిందో.. సీఎం పేరు ఖరారు చేయడానికి నాలుగు రోజులు పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు.

అయితే అధిష్టానం చేసిన ప్రతిపాధనకు డీకే ఓకే చెప్పినట్లుగా సమాచారం. కర్నాటక డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్‌, ఫైనల్‌గా 2+3 ఫార్మాలాకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మొదటి రెండేళ్లు సీఎంగా సిద్దు, ఆ తర్వాత మూడేళ్లు ముఖ్యమంత్రిగా డీకే ఉండేలా ఒప్పందం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవితో డీకే కోరుకున్న శాఖలు ఇచ్చేందుకు అధిష్టానం అంగీకారం తెలిపిందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సుదీర్ఘ బుజ్జగింపుల తర్వాత హైకమాండ్‌ హామీలకు సరేనన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

ANN TOP 10