AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు.. వచ్చే ఏడాది నుంచే 10+2 విధానం..!

రాష్ట్ర విద్యా వ్యవస్థలో భారీ మార్పులకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే పాఠశాల విద్యలో 10+2 విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఆధునిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్‌ విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
 విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. సంస్కరణల అమలులో ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠశాల విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం పేర్కొన్నారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉన్నత విద్యగా పరిగణించి విద్యార్థులకు ప్రత్యేక విద్య అందించాలని సూచించారు.

విద్యార్థులకు 12వ తరగతి నుంచే నైపుణ్య శిక్షణ (స్కిల్లింగ్‌) అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సీఎం స్పష్టం చేశారు.

ANN TOP 10