AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కశ్మీర్‌లో ఉగ్ర కాల్పులు.. ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లకు గాయాలు..

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కుల్గాం జిల్లాలోని అఖ్రాన్‌ ప్రాంతంలో సీఆర్పీఎఫ్‌ భద్రతా సిబ్బందిపై బుధవారం మధ్యాహ్నం దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మిర్‌ బజార్‌ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో చెక్‌పోస్టు వద్ద విధుల్లో ఉన్న జవాన్లపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. వెంటనే క్విక్‌ రియాక్షన్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం అనంత్‌నాగ్‌ జిల్లాలోని ఆసుపత్రికి తరలించారు.

దాడి అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో భద్రతా బలగాలు పరిసర ప్రాంతాలను చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. ఉగ్రవాదుల ఆచూకీ కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది. ఘటన నేపథ్యంలో కుల్గాం పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు బలగాలు ప్రయత్నిస్తున్నాయి.

ANN TOP 10