కిరణ్ అబ్బవరం ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా కూడా బిజీ అయ్యారు. ఇటీవల కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటిస్తున్న సినిమాలన్నీ సూపర్ సక్సెస్ కావడంతో ఇండస్ట్రీలో కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. హీరోగా సక్సెస్ అయిన కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా నిర్మాతగా కూడా ఈయన చేసిన సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కిరణ్ అబ్బవరం మెగా ఫోన్ పట్టారు.
తాజాగా ఈయన స్వీయ దర్శకత్వంలో రియాలిటీ (Reality)అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తెలియజేస్తూ ప్రమోషన్లను మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయగా ఈ రెండు పాటలకు చాలా మంచి ఆదరణ లభించింది. ఇకపోతే ఈ సినిమాలో ‘రఘుకుల తిలకా రారా’ (Ragukula Thilaka rara)అనే సాంగ్ ఉండబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇప్పటికే ఈ సాంగ్ యూట్యూబ్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి అద్భుతమైన పాట వెండితెరపైకి వస్తే మరో లెవల్లో ఉంటుందని చెప్పాలి. ఇదివరకే ఇరుముడి సినిమాలో మల్లెపూల పల్లకి సాంగ్ ఎలా హిట్ అయ్యిందో అదే రేంజ్ లో రఘుకుల తిలకా రారా సాంగ్ కూడా ఆదరణ పొందుతుందని అందరూ భావించారు. అయితే ఈ సినిమాలో నిజంగానే ఈ పాట ఉంటుందా లేదా అనే విషయంపై కిరణ్ అబ్బవరం స్పందించారు. ఇటీవల సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా రిపోర్టర్స్ నుంచి ఇదే ప్రశ్న ఎదురయింది.
ఈ ప్రశ్నకు కిరణ్ అబ్బవరం సమాధానం చెబుతూ.. నాకు రఘుకుల తిలకా రారా అనే సాంగ్ చాలా ఇష్టమని తెలిపారు. ఎప్పుడూ నేను ఇదే పాట వింటూ ఉంటాను. బేసిగ్గా నాకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఫస్ట్ డైరెక్ట్ చేయబోతున్న సినిమాలో ఈ పాట ఉండాలని కోరుకున్నాను. అందుకే ఈ పాటను ఒరిజినల్ గా ఎవరైతే కంపోజ్ చేశారో వారి చేతనే ఈ పాట పాడించామని , మా రియాలిటీ సినిమాలో రఘుకుల తిలకా రారా సాంగ్ ఉండబోతోంది అంటూ కిరణ్ అబ్బవరం క్లారిటీ ఇచ్చారు. ఇలా క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మరి ఈ సినిమా విడుదలైన సమయంలో థియేటర్లలో ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలియాల్సి ఉంది.








