బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలి కానీ రైతుల బాధలు పట్టవని వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.గడిచిన తొమ్మిదేళ్ల పరిపాలనలో తొమ్మిది వేల మంది రైతులను కేసీఆర్ సర్కార్ బలి తీసుకుందని ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో ధాన్యం తడిసి మొలకెత్తినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.వర్షానికి వడ్లు తడిసి ఓ కౌలు రైతు తాను చనిపోతున్నానని ముందే చెప్పినా ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా రైతుల సమస్యలు పట్టించుకోని,రైతులను ఆదుకోని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. ఓట్ల కోసమే కేసీఆర్ రైతు నినాదం ఎత్తుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికైనా కేసీఆర్ సిగ్గుపడాలని మరో రైతు ప్రాణం తీసుకోకముందే ఇచ్చిన మాట ప్రకారం ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.