తెలంగాణ రాష్ట్రంలోని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు నమోదైంది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి తన తండ్రిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎకరం 20 గుంటల భూమిని కబ్జా చేశారని తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కూతురు తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేశారు.
తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు మేరకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై 406, 420, 463, 464, 468, 471, R/w34ipc 156(3)crpc సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.