రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన యువకుడు ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయాడు. తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నరేష్ రెడ్డి కడుపునొప్పితో.. ఈ నెల 2న ఆమనగల్లు పట్టణంలోని స్వాతి మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. నరేష్ కు అపెండిక్స్ ఆపరేషన్ చేసిన వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ కు తరలించాలని చెప్పారు. దీంతో హైదరాబాద్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆమనగల్లు స్వాతి ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతో నరేష్ రెడ్డి మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. నరేష్ రెడ్డి మృతికి కారకులైన వైద్యులని వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.