AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నీట్ అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్

దేశవ్యాప్తంగా మెడికల్ కోర్సు ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ యూజీ పరీక్ష అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్‌ కార్డులను విడుదల చేసింది. పరీక్ష రాసే విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ పేర్కొన్న సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేయడం ద్వారా హాల్‌టికెట్లు పొందొచ్చు.కాగా ఈ నెల 7న నీట్ యూజీ పరీక్ష జరగనుంది. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా ఆఫ్ లైన్ మోడ్ లో అనగా పెన్ను, పేపర్ విధానంలో పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా 499 నగరాలు, పట్టణాల్లో జరిగే ఈ పరీక్షకు ఎన్‌టీఏ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ANN TOP 10