AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్ ప్రజలకు అలర్ట్.. నేటి రాత్రి నుంచి ఫ్లైఓవర్లు బంద్

హైదరాబాద్‌లో దాదాపు అన్ని ఫ్లైఓవర్లు మూతపడనున్నాయి. గ్రీన్‌ల్యాండ్ ఫ్లైఓవర్, PNVR ఎక్స్‌ప్రెస్ వే, లంగర్ హౌస్ ఫ్లైఓవర్ మినహా నగరంలోని మిగతా అన్ని ఫ్లైఓవర్లను మంగళవారం రాత్రి నుంచి మూసివేయనున్నారు. ‘షాబ్-ఈ-ఖాదర్’ జగ్నే కీ రాత్ సందర్భంగా మంగళవారం రాత్రి 10 గంటల నుంచి ఫ్లైఓవర్లపై రాకపోకలు నిలిపివేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే నెక్లెస్ రోడ్డు, PVNR రోడ్డులో కూడా వాహనదారుల రాకపోకలకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.

ప్రజలు, వాహనదారులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే 9010203626 ట్రాఫిక్‌ హెల్ప్‌లైన్ నెంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందుస్తు జాగ్రత్త చర్యగా ఫ్లైఓవర్లను బంద్ చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆంక్షలను అందరూ పాటించాలని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫ్లైఓవర్ల బంద్ కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

‘షాబ్-ఈ-ఖాదర్’ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను గత కొన్నేళ్లుగా విధిస్తున్నారు. అయితే చంద్రుని దర్శనాన్ని బట్టి రంజాన్ పండుగ ఏ రోజు అనేది ముస్లిం మత పెద్దలు నిర్థయిస్తారు. నెలవంకను బట్టి ఏప్రిల్ 22 లేదా 23న రంజాన్ పండుగను జరుపుకునే అవకాశముంది. ఇస్లాం ప్రకారం పవిత్ర రంజాన్ మాసంలో చివరి శుక్రవారంను అత్యంత పవిత్రమైనదిగా ముస్లిం సోదరులు భావిస్తారు. ఆ రోజు రాతంత్రా జగారం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.

ANN TOP 10