తెలుగుదేశం పార్టీలో చేరిన తరువాత మోట్టమోదటి సారిగా చిన్న శ్రీను మాట్లాడారు. టీడీపీ పార్టీలో చేరడం నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. పార్టీలో చేరడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే అదితి గజపతి రాజుని కలిసి స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎలా సమయాత్తం అవ్వాలి అనే విషయాలు పై చర్చించామని చిన్న శ్రీను తెలిపారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీ, మేయర్ ఎన్నికల్లో 100 శాతం గెలవడం లక్ష్యం గా పనిచేస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం పరిగెడుతుందని కొనియాడారు. విజయనగరం జిల్లాలో టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అందరిని కలుపుకొని వెళ్లి ఎన్నికల్లో విజయం సాధిస్తామని చిన్న శ్రీను క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దిశ నిర్దేశంలో ముందుకు వెళ్తామని అన్నారు.
విజయనగరంలో ఎమ్మెల్యే హయంలో అభివృద్ధి బాగా జరిగిందని కొనియాడారు. రాష్ట్ర ప్రజలు భాగస్వామ్యం, మద్దతుతో ముందుకు వెళతామని అన్నారు. ఇప్పటినుండి నేను టీడీపీ శ్రేణులు అందరిని కలుపుకొని పార్టీలో ముందుకు వెళతానని క్లారిటీ ఇచ్చారు. తొందరలోనే అశోక్ గజపతి రాజు ని కలిసి ఆశీస్సులు, సలహాలు తీసుకుంటానని అనంతరం పార్టీలో యాక్టీవ్ గా పనిచేస్తానని క్లారిటీ ఇచ్చారు.







