AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు..

యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్ టూర్‌లో భద్రతా లోపం స్పష్టంగా కనిపించింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా వేడుకలకు మథుర వస్తుండగా దారిలో భారీ శబ్దంతో విస్పోటనం సంభవించింది. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు అసలు ఏం జరిగింది?

శ్రీకృష్ణ జయంతిని సందర్భంగా రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధుర వెళ్తున్నారు. దారిలో స్వామి హరిదాస్ ఆడిటోరియంతో పలు ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ బ్రజ్ తీర్థ వికాస్ పరిషత్ బోర్డు సమావేశం నిర్వహించి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాంటా హోటల్‌కు బయలుదేరారు.

గురువారం సాయంత్రం సుమారు 5:30 గంటలకు గీతా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి బయలుదేరి పాగల్ బాబా మోర్, చైతన్య విహార్ మీదుగా ప్రయాణించి హోటల్ వివాంటాకు చేరుకుంది. అంతలో సూర్య నమస్కార్ తిరహా నుండి ముఖ్యమంత్రి వాహన శ్రేణి ఓవర్‌బ్రిడ్జిని సమీపిస్తోంది. ఓవర్‌బ్రిడ్జి సమీపంలో విద్యుత్ స్తంభాల నుండి తీగల్లో అకస్మాత్తుగా పెద్ద పేలుడు సంభవించింది.

ఒక్కసారిగా పొగ దట్టంగా వ్యాపించడం మొదలైంది. ఈ ఘటనతో సీఎం యోగి భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఆ సన్నివేశాన్ని చూసిన స్థానికులు రోడ్డు పక్కన నిలబడి ఉన్నారు. ఈ ఘటన మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటన గురించి అడగ్గా పైప్‌లైన్‌లను పరిశీలించిన తర్వాత పేలుడుకు సంభవించినట్టు సబ్-డివిజనల్ అధికారి ఒకరు వెల్లడించారు.

ANN TOP 10