మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా కోసం కసరత్తులు చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ మరో సినిమాని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే .మరికొన్ని రోజులలో ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా పూజ కార్యక్రమాలను జరుపుకోబోతుందని సమాచారం.
ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్ గురించి అలాగే ఈ సినిమా కథాంశం గురించి అభిమానులు ఎంతో ఆతృత కనబరుస్తున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ అర్బన్, అల్ట్రా-స్టైలిష్ బ్యాక్‌డ్రాప్‌లో కనిపించబోతున్నారని తెలుస్తోంది .ఈ పాత్ర కోసం చరణ్ సుమారు 15 కిలోల బరువు కూడా తగ్గాలని సుకుమార్ సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్ చేతికి సర్జరీ కావడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు . అతి త్వరలోనే ఈయన తిరిగి ఈ సినిమా పనులలో బిజీ కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్తా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ తో చేయబోయే ఈ సినిమా ద్వారా హాలీవుడ్ లో కూడా సత్తా చాటే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం అందుకోసమే పలువురు హాలీవుడ్ దిగ్గజాలను ఈ సినిమా కోసం రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ఆల్ట్రా స్టైలిష్ కోసం ప్రముఖ హాలీవుడ్ దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. దాదాపు ఈయనతో చర్చలు పూర్తి అయ్యాయని రామ్ చరణ్ కోసం జార్జియో రంగంలోకి దిగబోతున్నట్టు తెలుస్తుంది.
ఇలా రామ్ చరణ్ కోసం హాలీవుడ్ దిగ్గజ ఫ్యాషన్ డిజైనర్ రంగంలోకి రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే అధికారికంగా చిత్ర బృందం తెలియచేసే వరకు ఎదురు చూడాలి. ఒకవేళ ఇదే నిజమైతే కనుక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది ఒక క్రేజీ గ్లోబల్ కొలాబరేషన్ అవుతుందని చెప్పాలి. ఇక ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని కీలక విషయాలను చిత్ర బృందం త్వరలోనే వెల్లడించనున్నారు. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్ జోడిగా నటించే హీరోయిన్ విషయంలో కూడా పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. వీటన్నింటికి త్వరలోనే చిత్ర బృందం క్లారిటీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్లో ఇదివరకే రంగస్థలం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సినిమాపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.








