AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా..! డ్రైవర్ మృతి..

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారంహైదరాబాద్‌-1 డిపోకు చెందిన బస్సు నంబర్‌ టీఎస్34జడ్0030 (ఎక్స్‌ప్రెస్‌), సర్వీస్‌ నంబర్‌ బ్యాక్ 3, హైదరాబాద్‌ నుంచి బిచ్కుంద వెళ్తుండగా మధ్యాహ్నం 12 గంటల సమయంలో బిచ్కుంద సమీపంలో రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ అంజనేయులు బస్సు కింద చిక్కుకుని మృతి చెందారు.

ఆ సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికి స్వల్ప గాయాలు కాగా, బిచ్కుంద ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న బాన్సువాడ డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బస్సులో ఇరుక్కున్న డ్రైవర్ మృత దేహాన్ని బయటకు తీసి బస్సును తొలగించారు.

జుక్కల్ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రైవర్ ఆంజనేయులు మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పేర్కొన్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బస్సులో మొత్తం 13 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ సురక్షితంగా బయటపడ్డప్పటికీ కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు మంత్రికి వివరించారు. గాయపడిన ప్రయాణికులను అంబులెన్స్‌ల ద్వారా సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశామన్నారు.

ANN TOP 10