AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్..! ఓ.జీ.యూనివర్స్ స్పెషల్ వీడియో..!

సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా అభిమానులకు అదిరిపోయే స్పెషల్ ట్రీట్ ఇచ్చింది ఓజీ యూనివర్స్. ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఇటు సోషల్ మీడియా వేదికగా అటు బహిరంగంగా సంబరాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ యూనివర్స్ నుండి ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూడగా.. అభిమానుల ఎదురుచూపులకు తరలించుతూ డైరెక్టర్ సుజీత్.. పవన్ కళ్యాణ్ కి స్పెషల్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదిరిపోయే స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్రీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.

ఓ.జీ.లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఈ సినిమా సీక్వెల్ నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ తాజాగా ఈ సినిమా నుండి ఒక స్పెషల్ వీడియోని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియో విషయానికొస్తే ఓజీ ప్రపంచాన్ని ఇంకాస్త విస్తరించేలా.. కొత్త కాన్సెప్ట్ కథకు సంబంధించిన అంశాలపై ఆసక్తిని పెంచే విజువల్స్ ఉండేలాగా దీన్ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో చర్చిస్తున్నట్లు ఈ వీడియోలో చూపించారు. మన బ్లడ్ గ్రూపు ఓజీ సార్ అని తమన్ చెప్పడం , యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని సుజిత్ చెప్పడం సినిమాపై అంచనాలు పెంచేసాయి.

మీరేం చేస్తారో తెలియదు ఈ సినిమాతో ఫాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇవ్వాలి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పైగా ఇందులో ఆజాద్ హింద్ ఫౌజ్ నుండి నేటి కాలం వరకు జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ యూనివర్స్ ఉండనుంది అని మేకర్స్ చెప్పేశారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఓజీ యూనివర్స్ నుండి విడుదలైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. ఓజీలో పవన్ కళ్యాణ్ పోషించిన ఓజాస్ గంభీర పాత్ర చుట్టూ మరింత విస్తృతమైన కథను చూపించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ANN TOP 10