మార్కాపురం జిల్లా ::::
గొబ్బూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి
మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బూరు సమీపంలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఎదురెదురుగా వేగంగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.








