AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీ ఆఫీస్‌ ముట్టడి..! పోలీసుల వైఫల్యంపై బండి సంజయ్ ఫైర్..!

బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద యూత్ కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఆఫీస్ వద్ద ప్రధాని దిష్టిబొమ్మ దగ్దం చేసి, కార్యాలయ గేటుకు నల్ల రంగు పూస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తోందా? అంటూ నిలదీశారు. పట్టపగలు బీజేపీ ఆఫీస్ పై దాడి చేస్తుంటే పోలీసులు తమాషా చూస్తున్నారా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కు తొత్తులుగా పనిచేస్తున్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ నడిబొడ్డునున్న జాతీయ పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని రక్షణ కల్పించే బాధ్యత మీకు లేదా? అని పోలీసులను బండి సంజయ్ ప్రశ్నించారు. యూత్ కాంగ్రెస్ నేతలు అరాచకం చేస్తుంటే అక్కడ పోలీసులెందుకు లేరన్నారు. పోలీసుల వైఫల్యానికి మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావిస్తే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. ‘ఖబడ్దార్ కాంగ్రెస్ నేతలారా.. మేం తలుచుకుంటే బయట తిరగలేరు’ అంటూ హెచ్చరించారు.

సాయంత్రంలోపు బాధ్యులను అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టాలని పోలీసులను బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో యూత్ కాంగ్రెస్ నేతల చర్యకు మించి ప్రతి చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. బీజేవైఎం కార్యకర్తలు తలుచుకుంటే యూత్ కాంగ్రెస్ నేతలు బయట తిరగలేరంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వం దీనిపై తక్షణం స్పందించాలని బండి పట్టుబట్టారు. లేకపోతే కాంగ్రెస్ కార్యాలయాలను బీజేపీ శ్రేణులు దిగ్బంధిస్తారన్నారు. జరగబోయే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.

ఢిల్లీ ఆందోళనల్లో విద్యార్థులపై కాల్పులు, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను అవమానించారంటూ అంతకుముందు బీజేపీ కార్యాలయం ఎదుట యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్దం చేయడంతోపాటు ఆఫీసు గేటుకు నల్లరంగు పూశారు. దీంతో అక్కడ హెటన్షన్ వాతావరణం ఏర్పడింది. దీనికి ప్రతిగా బీజేవైఎం నేతలు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని పలువురు బీజేవైఎం నేతలను అదుపులోకి తీసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గాంధీ భవన్ చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించారు.

ANN TOP 10