శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నీటిలో ఒకరు గల్లంతైన ఘటన కలకలం రేపింది. ప్రాజెక్టు ముంపు గ్రామమైన పెద్దారవీడు మండలం కలనూతల వద్ద నీటి ప్రవాహానికి ఒక కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న నలుగురు యువకుల్లో ఒకరు గల్లంతైనట్లు స్థానికులు తెలిపారు. మరో ముగ్గురు యువకులు దగ్గరలోని చెట్టుపైకి ఎక్కి తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న మార్కాపురం జిల్లా డీఎస్పీ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ టీంను రంగంలోకి దించారు, గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సుంకేసుల నుంచి కలనూతల వెళ్లే మార్గమధ్యంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం, దానికి తోడు రాత్రి వేళ కావడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.








