AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాలయ్య NBK 111కు మాస్ టైటిల్..!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం పలు సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈయన గత ఏడాది అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అనుకున్న స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే తదుపరి సినిమాపై బాలయ్య అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఇదివరకే డైరెక్టర్ గోపిచంద్ మలినేని (GopiChand Malineni)దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna)నటించిన వీర సింహారెడ్డి సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే అంచనాలు ఉన్నాయి.

గోపీచంద్ డైరెక్షన్లో బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం NBK 111 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. అయితే తాజాగా చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి ఒక కీలక అప్డేట్ తెలియజేశారు. టీజర్ గ్లింప్ విడుదల చేస్తూ ఈ సినిమాకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ సెప్టెంబర్ ఆరో తేదీ రాబోతుందని తెలియజేశారు. బహుశా అదే రోజు టైటిల్ విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రెండు టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాకు “గాడ్”(God) లేదా “దాదా”(Dada)అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ రెండు టైటిల్స్ లో ఏదో ఒకటి చిత్ర నిర్మాతలు ఫైనల్ చేయబోతున్నారని టాలీవుడ్ సమాచారం. మరి nbk 111 కు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారు అనేది తెలియాలి అంటే సెప్టెంబర్ ఆరో తేదీ వరకు ఎదురుచూడాల్సిందే. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా నటి కాజల్ అగర్వాల్ నటించబోతున్నారని సమాచారం ముందుగా ఈ సినిమాలో నయనతార ఎంపిక అయినప్పటికీ ఈ సినిమా కథలో మార్పులు చేసిన నేపథ్యంలో నయనతార తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి.

ఇక వృద్ధిస్ సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా, ఇందులో మంచు మనోజ్ ,సంజయ్ దత్, శరత్ కుమార్ సముద్రఖని వంటి తదితరులు కీలకపాత్రలలో నటించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కావాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అదే విధంగా ఇటీవల బాలకృష్ణకు సర్జరీ కావడంతో షూటింగ్ కు చిన్న విరామం ఇచ్చారు. ఇక బాలకృష్ణ మరో దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్ లో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి.

ANN TOP 10