AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆంధ్ర వ్యక్తులకు తెలంగాణ ఆలయ బోర్డులో చోటా.. సీఎం రేవంత్ పై కవిత ఫైర్..!

యాదగిరిగుట్ట పాలకమండలిలో మెగా ఫ్యామిలీకి చెందిన వారిని నియమించడంపై కల్వకుంట్ల కవిత ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రం అయిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి నూతనంగా ప్రకటించిన పాలక మండలిలో మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొనిదెల సురేఖను సభ్యురాలిగా నామినేట్ చేయండంపై తీవ్ర విమర్షలు గుప్పించారు.

యాదగిరిగుట్ట ఆలయ పాలక మండలిలో కొనిదెల సురేఖకు స్థానం కల్పించడంపై కవిత ఫైర్ అయ్యారు. మెగా కుటుంబాన్ని సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుంటూ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులకు తెలంగాణలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డులో ఎలా స్థానం కల్పిస్తారంటూ ఫైర్ అయ్యారు.

ఇలా చేయండం వల్ల యావత్ తెలంగాణ ప్రజలను అవమానించడమే నని కవిత అన్నారు. ఈ నియామకంతో సీఎం రేవంత్ రెడ్డిని ఆంధ్ర రేవంత్ రెడ్డి అంటూ కవిత ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణ రాష్టానికి సీఎం గా ఉన్న వ్యక్తి తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన క్షేత్రాల విషయంలో పక్క రాష్ట్రాల ప్రభావానికి లొంగి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.

ANN TOP 10