రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళల కోసం తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్టంలో మహిళలకోసం 5,000 ప్రత్యేక బస్సులు నడపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాలిచ్చారు. దీనికోసం ఆగస్టు 27 నుంచి 31 వరకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ సారీ 240 ప్రత్యేక బస్సులు అదనంగా నడుపుతున్నామని మంత్రి పొన్నం తెలిపారు. పండుగ రద్దీకి అనుగుణంగా అవసరమైన ప్రాంతాల్లో అదనపు బస్సులు ఎర్పాటు చేయాలని తెలిపారు. ఆగస్టు 30 మధ్యాహ్నం నుంచి 31 వరకు తిరుగు ప్రయాణాల రద్దీ ఉండే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.
మహిళలకు మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం యథావిధిగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాల పొన్నం ప్రభాకర్ తెలిపారు. పండుగవేళ ప్రతి మహిళ బస్సు సౌకర్యాలను వినియోగించుకోవాలని మంత్రి పోన్నం తెలిపారు








