తెలుగు చత్ర పరిశ్రమలో కొత్త సినిమాలకు కొదవలేదు. ఈ నెలలో స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా ప్రసారం అవడంతో జనాలు వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. గతవారం రిలీజ్ అయిన ఇరుముడి చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది.. మరోవైపు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో ఇప్పుడు ఒక కొత్త చర్చ నడుస్తుంది. రెండు నిర్మాణ సంస్థల మధ్య గొడవ జరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ క్రమంలో సినిమాల మధ్య పోటీ కూడా నెలకొంది అని మరో వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్.. అలాగే ప్రముఖ నిర్మాత దిల్ రాజు మధ్య గొడవలు జరిగినట్లు ఉందని టాక్ నడుస్తుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య జరిగిన కొన్ని మాటల వల్ల సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలపై ఈ చర్చలు ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. అసలు గొడవలు ఏంటి? నిర్మాతల గొడవల వల్ల పెద్ద సినిమాలకు బ్రేక్ పడుతుందా? ఇంతకీ ఏ సినిమా వల్ల గొడవలు జరుగుతున్నాయి అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..
ఇటీవల కాలంలో వేరే భాషల సినిమాలకు తెలుగులో డిమాండ్ పెరుగుతూ వస్తుందన్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా పాన్ ఇండియా సినిమాలకు డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై కన్నడ హీరో యష్ నటించిన టాక్సిక్ మూవీ రిలీజ్ కు సిద్ధం అవుతుంది. ఈ నెల 26 న భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. 25 న సినిమా ప్రీమియర్ షోలు పడుతున్నాయి. అయితే ఇప్పుడు ఇరుముడి సక్సెస్ఫుల్ టాక్ తో రన్ అవుతున్న నేపథ్యంలో థియేటర్లు తగ్గించే అవకాశం లేదు అని ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇదే కనుక నిజమైతే ఎస్ టాపిక్ మూవీ వాయిదా పడడం లేదా ఉన్న థియేటర్లోనే సరిపెట్టుకొని రిలీజ్ అవ్వడం ఏదో ఒకటి జరుగుతుంది.. కొన్ని రోజుల క్రితం ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు సినిమాలను ఇక్కడ థియేటర్లలో ఎక్కువగా ఆడించాలి. వేరే భాషల్లో సినిమాలకు ప్రాధాన్యత కొంచెం తగ్గించాలి అని చెప్పడం ఇప్పుడు మరో కొత్త చర్చకు దారి తీస్తుంది.. ఈ వారం తెలంగాణలో థియేటర్ల కొరత ఉంటుందని స్పష్టం అవుతుంది.. మరి ఈ పరీక్షలో ఎవరు విన్నర్ గా నిలుస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.. ఏది ఏమైనా కూడా థియేటర్ల సర్దుబాటు గురించి క్లారిటీ రావాలంటే ఒక్కరోజు వెయిట్ చెయ్యాల్సి ఉంది.
‘ఇరుముడి’ కోసం ఫ్యాన్స్ రిక్వెస్ట్..
టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా నటించిన ఇరుముడి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.. గతంలో ఎన్నడు కనిపించిన విధంగా రవితేజ ఈ సినిమాలో కనిపించడంతో సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. వాటిని రీచ్ చేయాలా సినిమా స్టోరీ జనాలకు నచ్చడంతో ఈ మూవీ కోసం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. గత రెండు రోజులుగా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగా వసూలు అవుతున్నాయి. అయితే ఇప్పుడు ‘టాక్సిక్’ సినిమా థియేటర్ లోకి రాబోతున్న నేపథ్యంలో కొందరు అభిమానులు ఇరుముడికి థియేటర్లో తగ్గించవద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పెడుతున్నారు.. ఇరుముడి చిత్రానికి థియేటర్లు తగ్గించవద్దు అంటూ ఓ నెటిజన్ చేస్తున్న ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇకపోతే ఈవారం థియేటర్లో పరీక్షలో రిలీజ్ కాబోతున్న సినిమాలు ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటాయి..? ఏ సినిమా విన్నర్గా నిలిచి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది? టాక్సిక్ మూవీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయా..? నిర్మాతలు సినిమా విడుదలపై చర్చలు జరుపుతారా? అన్న ప్రశ్నల వల్ల ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలపై ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. మరి ఈ వారం సినిమాలు ఏది థియేటర్లోకి రాబోతున్నాయో అన్నది మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..








