AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నీ రెడ్ బుక్‌ను మడిచి పెట్టుకో..! నారా లోకేష్‌పై జోగి రమేష్ షాకింగ్ కామెంట్స్..!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజకీయ వేడి తగ్గడం లేదు. ముఖ్యంగా ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదిస్తున్న ‘రెడ్ బుక్’ రాజ్యాంగంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత జోగి రమేష్ మంత్రి లోకేష్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేడు ఆంధ్రప్రదేశ్‌లో చట్టబద్ధమైన పరిపాలన పక్కనపెట్టేసి సొంత రాజకీయ అజెండాతో అధికారులను ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ పాలన సాగిస్తున్నారని వైసీపీ నేత జోగి రమేష్ అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ బెదిరింపులకు భయపడరని, మీరు పెట్టే అక్రమ కేసులకు మేం భయపడమని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను వదిలేసి కక్షసాదింపు చర్యలకు పాల్పడుతుందని తెలిపారు.

రాష్ట్రంలో కూటమి సర్కార్ చట్టాలను ఉల్లంగిస్తుందని అన్నారు. నెక్ట్ సీఎం వైఏస్ జగన్ అవడం కాయం అని అన్నారు. జగన్ సీఎం అవడం కోసం ప్రజాఉద్యమాల్లో ముందుంటామని, ప్రజల కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు. మా ప్రభుత్వం వచ్చాక చట్టాన్ని ఉల్లంఘించిన వారిపైనే తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. వైసీపీ నేత జెోగి రమేష్ కామెంట్స్‌ రాజకీయంగా సంచలనం రేపాయి.

ANN TOP 10