మీడియా సమావేశంలో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ కోరికను నవంబరులో వెల్లడిస్తానని అన్నారు. తన రాజకీయ కోరిక, కార్యాచరణను నవంబరులో కార్యకర్తల ముందే వెల్లడిస్తానని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు రావడం వల్లే పీఏసీ సమావేశాలకు దూరంగా ఉంటున్నానని ఆయన వెల్లడించారు.
రెండు విధాలుగా..
రాజకీయంలో నేను రెండు విదాలుగా చూస్తా అని అన్నారు. ఒకటి ప్రజలతో పాటు రాజకీయ విషయాల్లో నేను క్లారిటీటీగా ఉంటా అని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ లీడర్లతో నాకు సంభందం లేదు కానీ నా కంటూ ఓక కోత్త ఎజెండా ఉందని చెప్పుకొచ్చారు. నవంబర్ లో నేను చెప్పే విషయం చాలా ముఖ్యమైందని అన్నారు. నాకు చాలా క్లారిటీ ఉందని సీఎం రేవంత్ రెడ్డి మరో ఐదేళ్లు అంటున్నారని మరోపక్క ఉత్తం కుమార్ రెడ్డికూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ప్లాన్ ఏంటి..
ప్రస్ధుతం జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసేలా ఉన్నాయి. ఆయన ఎం ఆలోచిస్తున్నారు. పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటారా లేదంటే సొంత ఎజెండా ఇంకేదైనా ప్లాన్ చేస్తారో చూడాలి. కాంగ్రెస్ పార్టీ పీసీసీ సమావేశాలకు సైతం ఆయన దూరంగా ఉన్నట్టు సమాచారం.







