దేశంలో ఇప్పటి వరకు ప్రధాన మంత్రులు అందరూ కలిసి చేసిన అప్పుల కంటే ప్రధాని నరేంద్ర మోడి చేసిన అప్పు ఎక్కువ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరు ప్రధానులు కలిసి 51 లక్ష ల కోట్లు అప్పు చేస్తే మోడీ మాత్రం ఏకంగా 151 లక్షల కోట్లు అప్పు చేశాడని అన్నారు. నేటికి మొత్తం 201 లక్షల కోట్ల అప్పు దేశం మీద ఉందని తెలిపారు.
ప్రపంచంతో పోటీ..
పీవీ నర్సింహ రావు రెసిడెన్షియల్ స్కూల్స్‌ని సీఎం ప్రారంభించారు. సర్వేల్‌లో స్కూల్ లోనే ఐఏఎస్‌లు , ఐపీఎస్‌లు చదువుకున్నారని గుర్తు చేశారు. నవోదయకు స్పూర్తి సర్వేల్ గురుకులం అని కొనియాడారు. ప్రపంచంతో పోటీ పడాలి అంటే మనకు ఈ విద్యా నాణ్యత సరిపోదని అన్నారు. ప్రపంచం ఇంకా మెరుగైన నాణ్యమైన విద్య ఆశిస్తుందని, నెర్చుకోవడమే కాదు నేర్చుకున్న వాళ్ళతో పోటీ పడాలని సీఎం రేవంత్ అన్నారు. జర్మన్, జపాన్, సౌత్ కొరియా, చైనా లాంటి దేశలతో మనం పిల్లలు పోటీ పడాలని అన్నారు.
రాంచందర్ రావుకి సీఎం కౌంటర్..
బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుకి సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. విద్యా వ్యవస్థ రాష్ట్రంలో బలపడిందని, 28వ స్థానంలో ఉన్న మన రాష్ట్రం ఇప్పుడు దేశంలో 18 స్థానంకి చేరిందని తెలిపారు. నేను ఎందుకు రాజీనామా చేయాలి. ఒకరు అన్నారు విద్య శాఖకు మంత్రి లేరు అని, నేను రాజీనామా చేయాలి అంటున్నారు. స్కూల్స్ పెట్టినందుకు నేను రాజీనామా చేయాలా.. విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్ పెట్టినందుకు రాజీనామా చేయాలా అని ఫైర్ అయ్యారు.
2034 వరకు నేనే సీఎం..
2034 వరకు నేనే సీఎం అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. అప్పటి వరకు పిల్లల కోసం పని చేయండి. అలా ప్రయాణం చేయండి నేను కూడా స్టేట్ చీఫ్ ఎక్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోసం హార్వర్డ్ వెళ్లానని సీఎం అన్నారు. 2034 వరకు నేనే ఉంటానని, 2024 జనవరి ముందు 1 వ తారీఖు ముందు జీతాలు వచ్చాయా మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండని సీఎం రేవంత్ తెలిపారు.







