AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కర్ణాటక కాలేజీల్లో హెచ్‌ఐవీ బాంబ్.. 7,000 మంది విద్యార్థులకు పాజిటివ్..!

కర్ణాటక రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ఓ సంఘటన సంలనం సృష్టిస్తుంది. మొత్తం రాష్టానే షాక్‌లోకి నెట్టేసింది. రాష్ట్రంలోని యువతకు హెచ్‌ఐవీ మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటం తీవ్ర ఆందోళనుకు కలిగిస్తుంది. కర్ణాటక స్టేట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ (KSAPS) వెల్లడించిన తాజా గణాంకాలు ఇప్పడు సంచలనంగ మారాయి. కర్ణాటక రాష్ట్రంలో 18 నుండి 25 ఏళ్ల వయస్సు గల వారిలో దాదాపు 7,000 మందికి పైగా కాలేజీ యువతకు, విద్యార్ధులు హెచ్‌ఐవీ బాధితులు ఉన్నట్టు లెక్కల్లో తేలింది.

 

అత్యధికంగా యువత..

హైచ్ఐవీ భాదితుల్లో ఎక్కువగా ఇంజనీరింగ్, డిగ్రీ ఇతర ఉన్నత చదువులు చదువుతున్న యువత ఉండటంతో రాష్ట్రంలోని నిపుణులు తీవ్ర ద్రిగ్బాంతిని గురిచేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య 2023-24లో 44,500గా ఉండగా ప్రస్థుతం ఇప్పుడు 2025-26 నాటికి అది 66,600కి చేరింది. దీంతో ఈ వార్త సంచనలంగా మారింది. ఈ డాటాను అనుసరించి ప్రస్థుతం జరిపిన వైద్య పరీక్షల్లో 18 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగిన 7,000 మందికి పైగా యువతకు, విద్యార్ధులకు వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా రావడంతో కర్ణాటక రాష్ట్రంలో ఆదోళన పరిస్ధితులు ఎర్పడ్డాయి.

 

దేశంలోనే మూడవ స్ధానం..

భారత దేశంలో హెచ్‌ఐవీ బాదితులు ఉన్న రాష్ట్రాల్లో కర్ణాటక రాష్ట్రం మూడవ స్ధానంలో ఉంది. ప్రస్ధుతం కర్ణాటక రాష్ట్రంలో దాదాపుగా 2,60,000 మందికి పైకా కేసులునట్టు అధికారుల అంచానావేస్తున్నారు. ర్ణాటక రాష్ట్రంలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై ఆరోగ్యశాఖ కొన్ని కార్యక్రమాలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు కళాశాలలో వైద్యం, బద్రతల పట్ల ప్రత్యేకమైన కౌన్సెలింగ్ నిర్వహించాలని పేర్కోంది. అందుకోసం ప్రభుత్వం జీవోను జారీ చేసింది.

ANN TOP 10