AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వందేమాతరం బిల్లుకు రాజ్యసభ గ్రీన్ సిగ్నల్..!

జాతీయ గేయం వందేమాతరానికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. జాతీయ గీతంతో సమానంగా ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వందేమాతరాన్ని అవమానించినా లేదా ఆలపిస్తుండగా ఆటంకం కలిగించినా నేరంగా పరిగణించేలా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా, లేక రెండూ విధించవచ్చని, వందేమాతరాన్ని అవమానించినా లేదా దాని ఆలస్యనానికి అడ్డు తగిలినా కఠిన చర్యలు ఉంటాయని ఈ బిల్లు స్పష్టం చేస్తుంది. ప్రతిపక్షాల నిరసనలు, వాకౌట్ల మధ్య రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది.

 

1971 నాటి చట్టానికి సవరణ

అయితే ప్రస్థుతం మన దేశంలో జాతీయ చిహ్నాలను గౌరవాన్ని కాపాడేందుకు ‘ది ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్, 1971 అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం జాతీయ జెండా, రాజ్యాంగం, లేదా జాతీయ గీతాన్ని దేశంలో ఏవరైనా అవమానిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. అయితే చట్టంలో ఇప్పటి వరకు జాతీయ గేయం అయిన వందేమాతరానికి తగిన ప్రాదాన్యమైన చట్టం లేదు. దీంతో 1971 నాటి చట్టానికి కేంద్ర ప్రభుత్వం సంవరణలు చేసి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు.

ANN TOP 10