AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అభిమానులకు లైఫ్‌టైమ్ గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్..!

అల్లు అర్జున్ ఆలియాస్ బన్నీ …గంగోత్రి సినిమాతో చిన్నగా మొదలెట్టిన ఈ ప్రయాణం ఇపుడు వరల్డ్ వైడ్ రేంజ్ కి ఎదిగిపోయింది,ఎవరు అవునన్నా కాదనన్నా బన్నీ ఈ స్థాయిలో ఎదగడానికి కారణం అతని వెనుక ఉన్న అభిమానులే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇక అలాంటి అభిమానులంటే ఎవరికీ ఇష్టముండరు చెప్పండి.ఇదిగో అలాంటి అభిమానులపై తనకి ఎంత ప్రేమ ఉంటుందో ,మరోసారి ప్రూవ్ చేశాడు బన్నీ

 

కీలకంగా ఉండే 900 మంది అభిమానులతో

 

విషయంలోకి వెళ్తే తాజాగా బన్నీ తన ఫ్యాన్స్ అసోసియేషన్ లో కీలకంగా ఉండే 900 మంది అభిమానులతో ఈ రోజు యూసుఫ్ గూడలో సమావేశం నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ ఫ్యాన్స్ మీట్ కి తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర నుంచి కూడా బన్నీ ఫ్యాన్స్ తరలిరావడం విశేషం.ఇక 900 మంది అభిమానులతో బన్నీ ఒకే వేదికపై కలిశాడు. అంత పెద్ద స్టార్ అయినా.. ఎక్కడా తొందరపడకుండా ఒక్కో అభిమానిని ఆప్యాయంగా పలకరించాడు. వాళ్లతో మాట్లాడాడు.. సెల్ఫీలు దిగాడు.. ఫొటోలు తీసుకున్నాడు. దీంతో “మా జీవితంలో ఈ రోజును ఎప్పటికీ మర్చిపోలేం” అంటూ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు.

 

ప్రతి అభిమానికీ బీమా పాలసీ

 

అయితే ఈ మీట్‌లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఆధ్వర్యంలో వచ్చిన ప్రతి అభిమానికీ బీమా పాలసీ అందించడం.అవును ఫ్యాన్స్ అంటే కేవలం సినిమా రిలీజ్ టైమ్‌లోనే హీరోల కోసం కటౌట్ కట్టే వాళ్ళే కాదు అంటూ ఇలా బన్నీ వారి కుటుంబాన్ని ఉద్దేశించి ఇలా నిర్ణయం తీసుకోవడం నిజంగా మెచ్చుకోతగ్గ విషయం. . ఇక బన్నీ తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారంతా.

 

ఇంకో విషయం ఏంటంటే… బన్నీ దాదాపు ఆరు గంటల పాటు అభిమానుల మధ్యే ఉన్నాడంటే వాళ్లకి ఎంత విలువ ఇస్తున్నాడో అర్థం అవుతుంది.ఎలాంటి హడావుడి లేకుండా ఒక్కో ఫ్యాన్‌తో మాట్లాడేందుకు టైమ్ ఇచ్చాడు. చాలామంది తమ కుటుంబ విషయాలు చెప్పుకోగా.. మరికొందరు ఎన్నేళ్లుగా బన్నీని కలవాలనుకున్న కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. అభిమానుల ముఖాల్లో కనిపించిన ఆనందమే ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో చెప్పడానికి.

 

ఫ్యాన్స్‌ని కుటుంబంలా చూసుకునే హీరో బన్నీయే

 

ఇక ఈ ఫ్యాన్స్ మీట్ తర్వాత సోషల్ మీడియాలో #AlluArjun, #Bunny, #AAFA హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా అభిమానులకు బీమా పాలసీలు ఇవ్వడం గురించి తెగ మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. “స్టార్ హీరో అంటే ఇలా ఉండాలి”,”ఫ్యాన్స్‌ని కుటుంబంలా చూసుకునే హీరో బన్నీయే” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

అయితే ఇక్కడితో ఈ కార్యక్రమం ఆగిపోవద్దని,ఇకపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలాంటి ఫ్యాన్స్ మీట్ నిర్వహించాలని బన్నీ ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్.అభిమానులను కలవడం.. వాళ్ల సమస్యలు తెలుసుకోవడం.. ఇంకా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం కూడా ఈ ప్లాన్‌లో భాగమని టాక్ వినిపిస్తోంది. హీరోగా రికార్డులు కొట్టడం ఒక ఎత్తు అయితే… అభిమానుల మనసులు గెలుచుకోవడం మరో ఎత్తు. ఇప్పుడు బన్నీ చేసింది కూడా అదే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో సందడి చేస్తున్నారు.చూడాలి ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ లు ముందు ముందు పొలిటికల్ మీటింగ్స్ గా మారుతాయో లేదో !

ANN TOP 10