AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్..!

నీట్ పేపర్‌ లీక్‌ వివాదంపై పార్లమెంట్‌లో చర్చించాలని, కేంద్రమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. అందుకొసం దాదాపుగా మూడు గంటల పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరియు ఇతర కాంగ్రెస్ నేతలు ధర్నా చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ధర్కాను బంద్ చేలంటూ వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి.

 

రాహుల్ గాంధీకి గాయం

నీట్ పేపర్ లీక్ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, విద్యార్థులపై జరిగిన దారుణ లాఠీచార్జికి జవాబుదారీతనం కోరినందుకే దేశంలోని ప్రతిపక్ష నాయకులను ప్రధానమంత్రి నివాసం నుంచి ఈడ్చుకెళ్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలోని ‘గణతంత్రం’ ఇప్పుడు ‘తుపాకీ-దండన వ్యవస్థ’గా మారిపోయినట్లు కనిపిస్తోందిని అన్నారు. ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేసి తరలిస్తున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముక్కుకు గాయమైంది. ఆందోళన స్థలంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

అరెస్టు చేయడం దుర్మార్గం..

ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఎంపీ ప్రియాంక గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చెసి జైల్‌కు తరలించడం దుర్మార్గం అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మోడీ ఇంటి ముందు ధర్నా చేసి నీట్ పరీక్ష పేపర్ లీక్‌ల విషయంలో పార్లమెంట్‌లో సమగ్ర చేయాలన్న రాహుల్ గాంధీ డిమాండ్‌కు బీజేపీ సర్కార్ భయపడిందని అన్నారు. అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడి విచారణ చేయమంటే, చర్చలు చేయమంటే బీజేపీ తోక ముడుస్తుందని ఫైర్ అయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు చలో రాజ్ భవన్‌కు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.

ANN TOP 10