టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత ఐదు దశాబ్దాలుగా హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో చిరంజీవి (Chiranjeevi) ఒకరు. విభిన్నమైన సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి హీరోగా మంచి సక్సెస్ అందుకున్న ఈయన పలు కార్యక్రమాలకు హోస్ట్ గా కూడా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గతంలో చిరంజీవి హోస్ట్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు అనే కార్యక్రమం ఎంతో విజయవంతంగా ప్రసారమైంది. ఇకపోతే తాజాగా చిరంజీవి మరొక టాక్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈయన వ్యాఖ్యతగా నెట్ ఫ్లిక్స్(Netflix) లో ఒక టాక్ షో ప్రారంభం కాబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్నాయి. అయితే తాజాగా ఈ టాక్ షోకి సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ టాక్ షో షూటింగ్ నేడు ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఈ టాక్ షో నేడు అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ ప్రారంభం అయింది. అయితే మొదటి గెస్టులుగా ఈ కార్యక్రమంలో భాగంగా కమెడియన్స్ సందడి చేయబోతున్నారని సమాచారం.
ఈ కార్యక్రమం ఫస్ట్ ఎపిసోడ్లో భాగంగా సీనియర్ కమెడియన్ బ్రహ్మానందంతో పాటు సునీల్, కమెడియన్ సత్య హాజరు కాబోతున్నట్టు సమాచారం. ఇక ఈ కార్యక్రమం 15 ఎపిసోడ్లు ఉండబోతుంది.ఓటీటీలో ప్రస్తుతం సినిమాలతో పాటు, రియాలిటీ షోలు, సెలబ్రిటీ టాక్ షోలకు కూడా మంచి ఆదరణ దక్కుతుంది. ఇందులో స్టార్ హీరోలు పర్సనల్ లైఫ్, సినీ కెరీర్ కు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పటికే జయమ్ము నిశ్చయమ్మురా, అన్ స్టాపబుల్ వంటి టాక్ షోలు మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.
మరి చిరంజీవి మొదటిసారి ఓటీటీ టాక్ షో గెస్ట్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ టాక్ షో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ టాక్ షో వ్యాఖ్యతగా చిరంజీవి సాగడం కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. చిరు రెమ్యూనరేషన్ కు సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. అయితే చిరంజీవి మాత్రం ఊహించని విధంగా రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. ఈ టాక్ షో 15 ఎపిసోడ్లు ప్రసారం కాబోతున్నాయి. అయితే ఒక్కొక్క ఎపిసోడ్ కోసం చిరంజీవి 12 నుంచి 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఒక్క ఎపిసోడ్ కోసం ఈ స్థాయి రెమ్యూనరేషన్ అంటే మామూలు రెమ్యూనరేషన్ కాదని చెప్పాలి. ఇక చిరు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన బాబి డైరెక్షన్లో కాకా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.








