AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మోదీ, ఔరంగజేబు ఒకే మట్టిలో పుట్టారు: సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు..

శివసేన (యూబీటీ) సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుతో పోల్చి వివాదానికి తెరలేపారు. ఔరంగజేబు, మోదీ ఇద్దరూ ఒకే గడ్డపై పుట్టారని వ్యాఖ్యానించారు.

 

శనివారం పుణెలో జరిగిన విలేకరుల సమావేశంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. “ఔరంగజేబు ఏ మట్టిలో అయితే పుట్టాడో, మోదీ కూడా అదే మట్టిలో పుట్టారు. ఔరంగజేబు గుజరాత్‌లోని దాహోద్‌లో జన్మించారు కదా?” అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వ్యక్తిత్వంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన్ను ఒక ‘అఘోరి’ అని, ‘క్రూరమైన వ్యక్తి’ అని అభివర్ణించారు. భారత రాజకీయాల్లో ఇంతటి క్రూరమైన వ్యక్తిని తాను ఎప్పుడూ చూడలేదని తీవ్రంగా విమర్శించారు.

 

నెహ్రూ, ఇందిరా గాంధీ, బాలాసాహెబ్ థాకరే వంటి నేతలు ఈ దేశం మట్టిలో పుట్టినవారని, వారితో మోదీకి పోలిక లేదని రౌత్ పేర్కొన్నారు. ఇదే సమయంలో ‘ఇండియా’ కూటమి ఐక్యత గురించి మాట్లాడుతూ, సమన్వయం ముఖ్యమని, ఒక సామాన్యుడు కూడా ప్రధాని కావొచ్చని అన్నారు.

 

సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలు కేవలం ప్రధాని మోదీని అవమానించడమే కాదని, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ వంటి మహనీయులు జన్మించిన గుజరాత్ రాష్ట్రాన్ని కూడా అవమానించడమేనని మండిపడ్డారు.విమర్శించడానికి సరైన అంశాలు లేక ప్రతిపక్షాలు నిరాశ, నిస్పృహలతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాయని బీజేపీ విమర్శించింది. గతంలో కూడా రౌత్, మోదీని ఉద్దేశించి ఇలాంటి చారిత్రక పోలికలతో విమర్శలు చేయడం గమనార్హం.

ANN TOP 10